Tuesday, May 7, 2024

తెలంగాణ రైతులకు కేసీఆర్ అంటే ఓ ధైర్యం

spot_img

హైదరాబాద్: ఓట్లు అంటే నాలుగు రోజుల పండుగ కాదని, ఎల్లారెడ్డి ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లీడర్లు కొంటుండొచ్చు కానీ ఎల్లారెడ్డి ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు మంచిగా పాలించే బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను అమలు చేయక కర్ణాటక ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు.

కర్ణాటక రైతులొచ్చి తెలంగాణ రాష్ట్రంలో లబో, దిబో అని మొత్తుకుంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి శివకుమార్ వచ్చి అక్కడి రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు మాత్రమే రైతులకు చాలని నిర్భయంగా చెబుతున్నాడు. అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నాడు. 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ ఉన్నాక మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ అవసరమా? రాజశేఖర్ రెడ్డి హయాంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేది. తెలంగాణ రైతుల ఆలించించాలి కటికేస్తే వచ్చే తెలంగాణ ప్రభుత్వం కావున కటికట్ చీకటిని అనుభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావున తెలంగాణ రైతులు ఆలోచించాలని కోరారు.

Also Read.. తెలంగాణ లో మార్పు వచ్చింది దేశంలో నంబర్ వన్ గా నిలిచింది

కరెంటు కావాలంటే కెసిఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలి. కటికే చీకటి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలి. తెలంగాణ రైతులకు కేసీఆర్ అంటే ఓ ధైర్యం. కెసిఆర్ వచ్చినంక చెరువులు మంచిగా చేసుకున్నాం. ఇంత మంచిగా చేసుకున్నాక కాంగ్రెస్ నమ్ముడు ఎందుకు. గతంలో రైతులకు ఒక్క రూపాయి ఎవరైనా ఇచ్చారా. ఈసారి మళ్లీ గెలిపిస్తే ప్రతి ఎకరానికి  16 వేల రూపాయలు ఇస్తారు. పథకాలతో పాటు పాటలను కూడా కాపీ కొడుతున్నారు కాంగ్రెస్ నాయకులు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తెలంగాణ రైతులు ఆగం కావద్దు నమ్మితే నట్టేట ముంచుతారని తెలిపారు.

కర్ణాటక రాష్ట్రంలో పైసలు లేవని విద్యార్థులకు అందజేసే స్కాలర్షిప్లను బందు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రకటించిన ఐదు గ్యారంటీలే ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు కావాలంటే అక్కడికి వెళ్లి చూడాలి. మల్లికార్జున కార్గే స్వగ్రామంలో రోడ్లు కూడా సక్కగా లేవు. మల్లికార్జున ఖర్గే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిక్షమేసిందని అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. మల్లికార్జున ఖర్గే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఖబర్దార్. తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా మల్లికార్జున గారికి మాట్లాడుతున్నాడు. వృద్ధులకు 2000 నుండి 5000 పెన్షన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచుతున్నారు. ఈ పెన్షన్ పెరగడం వల్ల వృద్ధుల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుంది. 5వేల పెన్షన్ కావాలంటే  బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.

Also Read.. వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేస్తాం

రేషన్ షాపులలో రానున్న రోజుల్లో సోనా మసూరి సన్న బియ్యం అందజేస్తాం. తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారమైంది. కర్ణాటక రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రమే బియ్యం పంపుతుంది. కెసిఆర్ ప్రభుత్వంలో కరువు లేదు, కాటకాలు లేవు పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. చెరువులు నిండుతున్నాయి. అసైన్డ్ భూములు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టా భూములుగా మారుతున్నాయి వీటిని క్రయవిక్రయాలు చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు. సురేందర్ పేదోళ్ల బిడ్డ ఆయనకు డబ్బులు లేవు బాగా పనిచేస్తడు. దయచేసి ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Latest News

More Articles