Friday, May 10, 2024

గోదావ‌రిపై క‌ర‌క‌ట్ట క‌ట్టి మంచిర్యాల‌కు వ‌ర‌ద‌ నీరు రాకుండా చేసే బాధ్య‌త నాది

spot_img

కాంగ్రెసోళ్లు కొత్త ప‌ద్ధ‌తి మొద‌లు పెట్టార‌ని, న‌న్ను గెలిపించండి.. నేను బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు అంటున్నార‌ట‌. అదంతా అవాస్త‌వం, ఝూటా ముచ్చ‌ట అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, దివాక‌ర్ రావుకు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

మీ ద‌గ్గ‌ర కాంగ్రెసాయ‌న గెలిస్తే మీకు వాడ‌క‌ట్టుకో పేకాట క‌బ్ల్. మంచిర్యాల నిండా పేకాట క్ల‌బ్బులు.. ఇక క్ల‌బ్బుల‌కు కొద‌వ ఉండ‌దు. ఇండ్లు అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలన్నారు సీఎం కేసీఆర్. చాలా ప్ర‌మాదం సుమా.. దెబ్బ‌తింట‌రు. జాగ్ర‌త్త‌గా ఆలోచించి ఓటేయాలి. ఇక కాంగ్రెస్ నాయ‌కులు కొత్త ప‌ద్ద‌తి మొద‌లుపెట్టారు. న‌న్ను గెలిపించండి నేను బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతా అని అంటున్న‌ర‌ట‌. ఇక్క‌డ ఉన్నాయ‌న కూడా అట్ల‌నే చెప్తున్న‌డ‌ట.. నాకు వార్త వ‌చ్చింది. అదేం లేదు. అదంతా అబ‌ద్దం, ఝూటా ముచ్చ‌ట‌. ఏద‌న్న లంగ‌త‌నం చేసి గెల‌వాల‌నే బ‌ద్మాష్‌గిరి త‌ప్ప అది వాస్త‌వం కాదు. మేం ప‌దేండ్లు క‌ష్ట‌ప‌డి అన్ని రంగాల్లో నంబ‌ర్‌వ‌న్‌లో ఉన్నాం. ఎల్ల‌మ్మ కూడ‌ బెడితే మ‌ల్ల‌మ్మ మాయం చేసింద‌న‌ట్టు ఈ ప‌దేండ్ల క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుత‌ది. దివాక‌ర్ రావు గెలిస్తే మంచి లాభం జ‌రుగుతది. దివాక‌ర్ రావు నన్ను ఎప్పుడూ వ్య‌క్తిగ‌త ప‌నులు అడ‌గ‌లేదు. పొలాల‌కు నీళ్లు రావాలి. లిఫ్టులు కావాల‌ని అడిగారు. గోదావ‌రిపై క‌ర‌క‌ట్ట క‌ట్టి మంచిర్యాల‌కు చుక్క వ‌ర‌ద‌ నీరు రాకుండా చేసే బాధ్య‌త నాది. ఆ ప‌ని కూడా చేస్తాం. అవ‌స‌ర‌మైతే ఈ ఎండాకాలంలో మొద‌లుపెట్టి శ‌ర‌వేగంగా పూర్తి చేయిస్తాం. దివాక‌ర్ రావును గెలిపిస్తే మంచి జ‌రుగుతుందని తెలిపారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: తెలంగాణ రైతులకు కేసీఆర్ అంటే ఓ ధైర్యం

Latest News

More Articles