Sunday, April 28, 2024

సింగ‌రేణి కార్మికులకు ఇన్‌క‌మ్ ట్యాక్స్ ర‌ద్దు చేయమంటే.. మోదీ చేస్తలేడు

spot_img

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికులకు ఇన్‌క‌మ్ ట్యాక్స్ ర‌ద్దు చేయ‌మ‌ని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీకి ఎప్పుడో పంపించాం. ఆ మోదీ చేస్త‌లేదు. ఇక ఉల్టా మీరు బంద్ పెట్టండి అని అంటున్న‌రని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, దివాక‌ర్ రావుకు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

Also Read.. గోదావ‌రిపై క‌ర‌క‌ట్ట క‌ట్టి మంచిర్యాల‌కు వ‌ర‌ద‌ నీరు రాకుండా చేసే బాధ్య‌త నాది

ఆస్ట్రేలియా నుంచి మా ఆదానీ బొగ్గు తెస్తుండు దాన్ని కొనండంటూ జ‌బ‌ర్‌ద‌స్తీ చేస్తుండు. బీజేపీ పార్టీ గురించి ఆలోచించాలన్నారు. 157 మెడిక‌ల్ కాలేజీలు పెడితే మ‌న‌కు ఒక్కటంటే ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేదు. న‌వోద‌య పాఠ‌శాల‌లు ఇవ్వలే. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. బీజేపీకి ఓటేస్తే మోరీలో పారేసిన‌ట్టే అని అన్నారు.  సింగ‌రేణిలో డిపెండెంట్ ఉద్యోగాల‌ను ఊడ‌గొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత డిపెండెంట్ ఉద్యోగాల‌ను పున‌రుద్ధ‌రించుకున్నామ‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

Also Read.. తెలంగాణ రైతులకు కేసీఆర్ అంటే ఓ ధైర్యం

బీఆర్ఎస్ వచ్చాక 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఎవ‌రైనా ఉద్యోగం తీసుకోక‌పోతే వారికి 25 ల‌క్ష‌ల రూపాయాలు ఇస్తున్నాం.  మొన్న‌నే సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్, ద‌స‌రా లాభాల్లో వాటా కానీ.. రూ. 1000 కోట్లు పంచినం. ప్ర‌తి కార్మికుడికి ల‌క్షా 80 వేలు, 2 ల‌క్ష‌లు వ‌చ్చాయి. గ‌తంలో 18, 19 శాతం ఇచ్చేటోళ్లు లాభాల్లో, కానీ ఇవాళ మ‌నం 32 శాతం వాటా ఇచ్చాం. దివాక‌ర్ రావు సౌమ్యుడు. మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉండే మ‌నిషి, అరాకిరి ప‌నులు చేసే వ్య‌క్తి కాదు. ఆయ‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించండి అని కేసీఆర్ కోరారు.

Latest News

More Articles