Friday, May 17, 2024

కాంగ్రెస్‎కు పొరపాటున ఓటేస్తే ఆ ఆరు కష్టాలు గ్యారెంటీ

spot_img

తెలంగాణలో తమ ఉనికిని చాటుకునేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తాజాగా హైదరాబాద్‎లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించిన కాంగ్రెస్.. ఎన్నికలే లక్ష్యంగా కొన్ని గ్యారెంటీలు ఇచ్చింది. ఆ గ్యారెంటీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు పొరపాటున ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీ అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం గ్యారంటీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు పక్కా గ్యారెంటీ, తాగునీటి కష్టాలు పక్కా గ్యారెంటీ, రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్‌లో నిలబడటం పక్కా గ్యారెంటీ, రైతు బంధు, దళిత బంధు పథకాలకు రాంరాం అని ఎద్దేవా చేశారు.

Read Also: ట్విట్టర్ ఖాతాదారులకు షాక్.. ప్రతి ఒక్కరూ నెలనెలా సర్వీస్ చార్జ్ చెల్లించాల్సిందే!

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అన్నారు. బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా, ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేశారు. ఢిల్లీ కీలుబొమ్మలు అధికారం చేపడితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టుపెట్టడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. చేతకాని చేవలేని వాళ్లకు పగ్గాలు ఇస్తే పల్లె పల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ అంటూ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమ స్థాయికి పడిపోతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలను నమ్మవద్దని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also: ప్రేమించట్లేదని యువతికి పురుగుల మందు తాగించిన ఇద్దరు పిల్లల తండ్రి

Latest News

More Articles