Sunday, May 19, 2024

ఎన్నికల్లో నాకు సరైన పోటీ లేకుంటే మజా ఉండదు

spot_img

ప్రతిపక్షాలు ఏం చేశాయని ప్రజలను ఓటు అడుగుతాయని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చాదరగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి తన అనుచరులు 200 మందితో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అభివృద్ధితోపాటు అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. రానున్న ఎలక్షన్లో బీఆర్ఎస్‎ను భారీ మెజార్టీ దిశగా గెలిపించడానికి అందరం కష్టపడతామని ఆయన అన్నారు.

Read Also: ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలకు ముందు నిర్మాతకు భారీ షాక్

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నమ్మకం అంటే కేసీఆర్.. విశ్వాసం అంటే బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో తనకు పోటీగా ప్రతి పక్షాల పార్టీల నుండి సరైన నాయకులు లేరని అన్నారు. సరైన పోటీ లేకుంటే మజా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. ప్రతిపక్షాలు ఏం చేశాయని ప్రజలను ఓటు అడుగుతారని మంత్రి మండిపడ్డారు.

Read Also: తెలుగు రాష్ట్రాల్లో 105 మంది కుబేరులు.. హైదరాబాద్‌లోనే 87 మంది

Latest News

More Articles