Sunday, May 19, 2024

దేశంలో తెలంగాణ రికార్డు: వ్యవసాయం కోసం నాలుగున్నర లక్షల కోట్లు ఖర్చు

spot_img

వనపర్తి : గతంలో కాంగ్రెస్ పాలన అంతా మోసపూరితమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోని సమస్యలన్నింటికి ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. వనపర్తి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Also Read.. మైనంపల్లిని చిత్తుగా ఓడిస్తా.. నక్క రాజశేఖర్ గౌడ్

బీఆర్ఎస్ ప్రకటించిన పథకాలపై ప్రతిపక్షాలవి కేవలం అపోహలు మాత్రమేనని, ప్రజలకు భరోసా కల్పిస్తూ బీఆర్ఎస్ పాలన సాగుతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులన్నీ 30, 40 ఏళ్లు దాటినవేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కేవలం మూడున్నర ఏండ్లలో పూర్తి చేసి సాగు నీరు అందజేశామని వివరించారు.

Also Read… గాజా ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎమర్జెన్సీ వార్నింగ్

అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అభివృద్ధిలో దాపరికం లేదని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles