Friday, May 17, 2024

తెలంగాణలో డైనమిక్ ప్రభుత్వం ఉన్నందునే పరిశ్రమలు తరలివస్తున్నయ్

spot_img

ఖమ్మం జిల్లా: ఖమ్మం పోలీసులు భారీ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఒకేరోజు 150 కంపెనీలను తీసుకొచ్చి 8200 ఉద్యోగాలు కల్పించడం నిజంగా అభినందించదగిన అంశమన్నారు. ఇవాళ ఒక్కరోజే 5000 మందికి ఉద్యోగాలు కల్పించి మరో మూడు వేల మందికి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారని తెలిపారు.

‘‘తెలంగాణలో డైనమిక్ ప్రభుత్వం ఉండడం చేతనే పరిశ్రమలు తరలివస్తున్నాయి. చదువుకున్న వారందరికీ ఏ ప్రభుత్వము ఉద్యోగాలు రావు.  ప్రభుత్వ , ప్రైవేటు పరిశ్రమల్లో ఎక్కడైన ఉద్యోగం పొందడం యువత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఐటి ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం బెంగళూరును కూడా వెనుకకునట్టి ప్రథమ స్థానానికి చేరింది.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో ప్రైవేట్ సెక్టార్లు లక్షలాది ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. వరి పంట సాగు చేయడంలో అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువ దిగుబడి వస్తోంది. పంజాబ్ కంటే కూడా తెలంగాణలో పంటలు అధికంగా పండుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ వల్ల ఇవాళ తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. ఖమ్మంలో ఐటీ హబ్ సాధిస్తున్న విజయాలను మంత్రి కేటీఆర్ అమెరికా సభలో ప్రస్తావించటం మనకెంతో గర్వకారణం.’’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

Latest News

More Articles