Friday, May 17, 2024

భారత భవిష్యత్ బీఅర్ఎస్

spot_img

వనపర్తి జిల్లా: గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో 200 మంది చేరారు. వారికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘భారత భవిష్యత్ బీఅర్ఎస్. తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం. తెలంగాణ వ్యవసాయ, సంక్షేమ పథకాలు అమలు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలయిందన్నారు.సమీప భవిష్యత్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు విధిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. సమస్యల పరిష్కారమే తెలంగాణ సర్కారు ఎజెండా అని స్పష్టం చేశారు.

ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు . సాగునీటి రాకతో ప్రతి చేతికి ఉపాధి లభించిందన్నారు. తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగా తెలంగాణ గ్రామాల స్వరూపం, ప్రజల జీవన ప్రమాణాలలో సమూల మార్పు సాధ్యమయిందన్నారు.

నాడు తెలంగాణ కోసం..నేడు దేశం కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలుకావాలని ఆకాంక్షించారు. దేశంలోని వనరులు సద్వినియోగం చేసుకోవాలి.. ప్రజల  జీవితాల్లో మార్పురావాలి అన్నది కేసీఆర్ ఆకాంక్ష. మహారాష్ట్ర నుండి మార్పు మొదలవుతున్నదని మంత్రి అన్నారు.

Latest News

More Articles