Thursday, May 2, 2024

ప్రముఖ సంగీత దర్శకుడు ‘రాజ్‌’ కన్నుమూత

spot_img

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు రాజ్‌(తోటకూర సోమరాజు) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కోటితో కలిసి ఎన్నో సినిమాలకు ఆయన సంగీతం అందించారు. పలువురు పలువురు సినీ ప్రముఖులు రాజ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

దాదాపు 150కు పైగా చిత్రాలకు రాజ్‌-కోటి పనిచేశారు. కోటి నుంచి విడిపోయిన రాజ్‌ అనంతరం సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘ప్రేమంటే ఇదేరా’ (నేపథ్య సంగీతం) వంటి చిత్రాలకు సంగీతం అందించారు. అతిథి పాత్రల్లోనూ రాజ్ కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పించారు.

Latest News

More Articles