Friday, May 17, 2024

ఖమ్మం జిల్లా పిట్టలదొర..వెన్నుపోటు చరిత్ర మర్చిపోయావా..రాజకీయాలలో నువ్వో బచ్చా

spot_img

ఖమ్మం జిల్లా: కళ్యాణ లక్ష్మి ఒక గొప్ప పథకం. లక్షలాదిమంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ సహాయమందించారని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణ లక్ష్మిలో కొందరు దొంగలు పడ్డప్పుడు ముఖ్యమంత్రి సరిచేసి ఎమ్మెల్యేలకు అధికారం ఇచ్చి అవినీతిని కట్టడి చేశారన్నారు. 51 వేల రూపాయలతో మొదలైన కళ్యాణ లక్ష్మి పథకాన్ని లక్షకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని పేర్కొన్నారు.  తెలంగాణలో అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లబ్ధి చేకూర్చారని తెలిపారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి మానవీయ కోణంలో పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

కడుపులో విషం నింపుకున్నరు

‘‘జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మంను గతంలో పట్టించుకున్న నాయకుడే లేరు. కళ్ళుండీ చూడలేని కబోదులు కొంతమంది ఉన్నారు. వారికి ఖమ్మం అభివృద్ధి కనిపించడం లేదు. ఖమ్మం అభివృద్ధి మీద కొందరు కడుపులో విషం నింపుకున్నారు. కెసిఆర్ , కేటీఆర్ అండతో పువ్వాడ అభివృద్ధి చేయడానికి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటిదాకా గులాబీ జెండా కింద ఉండి సంపాదించుకున్న ఒక నాయకుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

పాపపు సొమ్ము పేరుకు పోయింది నీ దగ్గర..

టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి ? ఇవాళ ఆయన ఆర్దిక పరిస్థితి ఏంటి.?  కేసీఆర్,  కేటీఆర్ లను ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడి వేల కోట్లు సంపాధించాడు. పాపపు సొమ్ము పేరుకు పోయింది నీ దగ్గర.. కాంట్రాక్టర్ గా ఉన్నప్పుడు ఎన్ఎస్పీ కెనాల్  పనులు చేయకుండా వందల కోట్ల రూపాయలు బొక్కినావు. నీ పాలోడే ఆరోజు నీ మీద కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ రిపోర్ట్ ఉంటే జైల్లోకి పోకుండా రాజకీయాల్లో చేరావ్.  నీ తప్పులన్నీ అట్లనే ఉన్నాయి.

ఎడమకాలి చెప్పుతో సమానం

అధికార పార్టీలో ఉండి డిసెంబర్ 31 వరకు పొగిడిన నాయకుడు ఇవాళ అదే పోలీసులు విమర్శిస్తున్నారు. మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన మహానుభావుడు నువ్వు. మళ్ళీ పోలీసులను విమర్శిస్తున్నారు. డబ్బుందని విర్రవీగుతున్న నాయకుడివి నువ్వు. మా ఖమ్మం ప్రజలకు మీ డబ్బు ఎడమకాలి చెప్పుతో సమానం. నీ డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు ఇక్కడ లేరు.  నలుగురికి డబ్బులు ఇచ్చి సభలు పెట్టి అదే గొప్పగా ఫీలవుతున్నావు. సభ పెట్టితే ఖాళీ కూర్చీలు ని చూసి ఆ ప్రస్టేషన్లో నన్ను తిడుతున్నాడు.

ఏ రాజకీయ పార్టీలో కి పోవాలో తెలియని ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడు. నేను చెబుతున్న. రెడ్డికి ఒక సిద్ధాంతం లేదు,  ఒక విలువ లేదు , ఒక గుణం లేదు.  కేవలం డబ్బుతో రాజకీయం పనిచేయాలని చూస్తున్నారు.

ఆయన గొంతు కోసిన చరిత్ర మర్చిపోయావా

టిఆర్ఎస్ అభ్యర్థులను ఇదే పార్టీలో ఉండి ఓడించిన ఘనమైన చరిత్ర నీదని గుర్తు చేస్తున్నాను. 2018లో నువ్వు చేసిన పని వాళ్ళనే  2019లో నీకు సీటు రాకుండా చేశారు. 2014లో కూరాకుల నాగభూషణం గొంతు కోసిన చరిత్ర మర్చిపోయావా.  ఆయన స్థలం కాగితాలు నీ దగ్గర కుదవపెట్టుకుంటే కనికరించమని పేద యాదవుడు కోరుకుంటే నువ్వు కనికరించలే, కరుణించలేదు.  రేపు రా బిడ్డ నీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళ చిట్టా చాలా పెద్దగా ఉంది . వాళ్లంతా రేపు రోజుల్లో మీకు స్వాగతం చెప్పబోతున్నారు.

ఖమ్మం జిల్లా రాజకీయాలలో నువ్వో బచ్చా

నువ్వు రాజకీయ పార్టీలు మార్చావు. నువ్వు మోసం చేసిన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పిట్టలదొర మాదిరి ప్రగల్భాలు పలుకుతున్నారు. పిట్టలదొర ఎక్కువ గా ఉహించుకొని ప్రజల ముందు కామెడీ చేస్తారు. ఆయన కూడా ఖమ్మం జిల్లా పిట్టలదొరలాగా మారి మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలలో నువ్వో బచ్చా. ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో పువ్వాడకు ఒక చరిత్ర ఉంది. మీ చరిత్ర ఏంటో ఆలోచన చెయ్.  నీకు డబ్బు ఉందని ఏది పడితే అది అంటే ఊరుకుంటామా బిడ్డ.

నీ పక్కన ఉన్నోళ్లు రౌడీషీటర్లు,  గంజాయి అమ్ముకునేటోళ్లు..  బ్యాంకులను దోచుకున్నోళ్ళు, రైతుల నోట్లో మట్టుకుట్టినోళ్ళు ఉన్నారు. దోపిడిదారులు అరాచక వాదులు నీ  పక్కన ఉన్నారు. నువ్వు కాంట్రాక్టర్ వి మట్టిగుట్టలు, సిమెంట్ ల గురించి మీకు తెలుసు. కానీ మాకు సంబంధం లేదు,  మాకు అవసరం లేదు.

ఖమ్మం జిల్లాకు ఒక్కపని అయిన చేసావా?

ఖమ్మం మట్టిగుట్టలను జాతీయ రహదారులు అభివృద్ధి కోసం కేటాయించాము. ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టు అయిన ఒక్కపని అయిన చేసావా ఆలోచించుకో. రోడ్డు లేకుండా లైట్లు పెట్టకుండా చీకట్లో మగ్గమంటావా.. ఖమ్మం అంటే నీకు అసహ్యం.  ఖమ్మం అంటే మీకు నచ్చదు.  ఖమ్మం మీద విషం కక్కుతున్నావ్.  ఖమ్మంలో బచ్చాగాన్ని నా మీద పోటీ పెడతానన్నాడు ఎవరొచ్చినా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో నీకు రాజకీయ భవిష్యత్తు లేదు.  కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయితీ ఇస్తానన్నట్టుగా ఉంది నీ ప్రవర్తన.‌ మా పార్టీలో ఉన్న వాళ్లందర్నీ ఓడించాలని చూసావు.

అప్పుడు నీకు కేసీఆర్ విలువ తెలుస్తుంది

ఎస్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ ను ఓడించలేదా ?  2018 ఎన్నికల్లో ఐదుగురు నీ మనుషులకు టికెట్ ఇస్తే ఒక్కరినైనా నువ్వు గెలిపించగలిగావా? ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది. ఓడించిన చరిత్ర నీది. నిన్ను తీసుకునే పార్టీ కూడా నీ చరిత్ర మీద సమాచారం తీసుకుంటుంది. నువ్వు చేరే పార్టీలో కూడా అటొకడు, ఇటొకడు తంతాడు అప్పుడు నీకు కేసీఆర్ విలువ తెలుస్తుంది.

ఖమ్మం జిల్లా నుంచి తరిమి కొడతాం

ఇది ప్రజాస్వామ్యం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు గెలిపించాలి.. కానీ నీలాంటి పిట్టల దొరలు కాదు. నీ చరిత్ర,  నీ పక్కన ఉన్న వాళ్ళ చరిత్రను బయటకు తీసి, ఖమ్మం జిల్లా నుంచి తరిమి కొడతాం. బీఆర్ఎస్ పార్టీ శక్తి ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు . సీఎం కావాలంటే ఒక చరిత్ర ఉండాలి . అంతేగాని నీ పక్కనున్నోళ్లు సీఎం , సీఎం అంటే నువ్వు సిఎం కావు. ఆర్దిక అరాచకవాదులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఖమ్మం రాజకీయ భ్రష్టు పోయాయి. విపక్ష పార్టీలు ఇతర పార్టీల నాయకులు కూడా ఈ విషయం మీద ఆలోచన చేయాలి.’’ అని మంత్రి పువ్వాడ నిప్పులు చెరిగారు.

Latest News

More Articles