Saturday, May 18, 2024

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి..!

spot_img

హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందారు. ఏప్రిల్ 20 నుంచి అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యానేజ్ అవ్వడంతో చనిపోయారు. 1973లో రామరాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన శరత్ బాబు.. 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస లో జన్మించారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దిక్షితులు. హీరోగా, విలన్ గా, సహా నటుడిగా తెలుగుట తెరపై అనేక పాత్రలు పోషించారు శరత్ బాబు.

దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన శరత్ బాబు కె బాల చందర్ డైరెక్షన్ లో వచ్చిన తమిళ చిత్రం నిజల్ నిజమగిరదు (1978) ద్వారా పాపులర్ అయ్యారు. మరో చరిత్ర, ఇది కధకాదు, తాయరమ్మ బంగారయ్య, మూడు మూళ్ళ బంధం, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, అభినందన, సాగర సంగమం, సితార వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక అన్వేషణ, స్వాతి ముత్యం, సంసారం ఒక చదరంగం, కోకిల, అపద్భాంధవుడు, సంకీర్తన, శ్రీరామదాసు, మగధీర తదితర చిత్రాల్లోను మంచి పేరు సంపాదించుకున్నారు. శరత్ బాబు ఆఖరిగా తమిళ్ చిత్రం వసంత ముల్లైలో నటించారు.

Latest News

More Articles