Saturday, May 18, 2024

గిరిజన సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం..!

spot_img

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్, విప్ గొంగిడి సునీత, dccb చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.     ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ‘గిరిజన సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్యేయం. ప్రతి గిరిజన తండా అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో త్వరలో రెండు కోట్లతో సంత్ సేవ సేవాలాల్ భవన్ తో పాటు నూతన గిరిజన గురుకులానికి మంజూరు.

తెలంగాణలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. బీజేపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ది చేతల ప్రభుత్వం. ఈ ఏడాది ఆలేరు నియోజకవర్గంలోని తండాలకు 11 కోట్ల 21లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది. బీజేపీ నాయకులు గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన రిజర్వేషన్ 10% పెంచి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు’ అని చెప్పారు.

 

Latest News

More Articles