Friday, May 17, 2024

జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ లకు విశేష స్పందన

spot_img

జిహెచ్ఎంసి క్రీడా  మైదానాలు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య క్రీడా స్ఫూర్తితో  పాల్గొంటున్నారు. ఆరు సంవత్సరాల నుండి 16 సంవత్సరాల విద్యార్థులకు జిహెచ్ఎంసి వ్యాప్తంగా జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను అన్నిప్లే గ్రౌండ్ లలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చార్మినార్ కులి కుతుబ్ షా స్టేడియం, సికింద్రాబాద్ మారేడ్పల్లి ప్లే గ్రౌండ్, కుకట్ పల్లి, శేరిలింగంపల్లి చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఎల్ బి నగర్ ఉప్పల్ స్టేడియం ఇతర సెంటర్లలో విద్యార్థులు పోటాపోటీగా పాల్గొంటున్నారు.

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.  44 రకాల క్రీడలలో 915 సెంటర్లలో ఉదయం 6:15 గంటల నుండి 8:15 గంటల వరకు  శిక్షణ అందిస్తున్నారు. స్విమ్మింగ్, క్రికెట్, బాస్కెట్బాల్, స్కేటింగ్, రోలర్, కరాటే, కోకో,  జిమ్నాస్టిక్స్ , ఉషు, బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, హాకీ, రెజ్లింగ్, థైక్వాండో, హ్యాండ్ బాల్, సపక్ తక్రా, స్కై మార్షల్, వాలీబాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. స్పోర్ట్స్ క్విజ్, ఇంటర్ టోర్నమెంట్ విద్యార్థులకు నిర్వహిస్తారు.

 

Latest News

More Articles