Thursday, May 2, 2024

ఐపీఎల్ 2023: ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై విజ‌యం

spot_img

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ముంబై ఇండియ‌న్స్‌పై 6 వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజయం సాధించింది. ఆరో విజ‌యంతో ప్లే ఆఫ్ అవకాశాల‌ను ప‌దిలం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత ముంబైని చెపాక్‌లో ఓడించడం గమనార్హం.

తొలుగు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 8 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు విఫ‌లమయ్యారు. నేహ‌ల్ వ‌ధేరా(64) రాణించడంతో ఆ స్కోరైనా సాధించింది. సూర్య‌కుమార్ యాద‌వ్‌(26), ట్సిస్ట‌న్ స్ట‌బ్స్(20) ఫర్వాలేదనిపించగా.. ఇషాన్ కిష‌న్(7), రోహిత్ శ‌ర్మ‌(0), టిమ్ డేవిడ్(2) విఫలమయ్యారు. చెన్నై బౌల‌ర్ల‌లో మ‌థీశ ప‌థిర‌ణ 3, దీప‌క్ చాహ‌ర్, తుషార్ దేశ్‌పాండే 2, జ‌డేజా ఒక వికెట్ తీశారు.

140 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన చెన్నై ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30), శివం దూబే(26) రాణించడంతో విజయం నల్లేరుపై నడకైంది. డెవాన్ కాన్వే(18), అజింక్యా ర‌హానే(21) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ముంబై బౌలర్ల‌లో పీయూష్ చావ్లా 2, స్ట‌బ్స్, ఆకాశ్ మ‌ద్వాల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Latest News

More Articles