Sunday, May 19, 2024

కోకాపేట గౌడ్ ఆత్మీయ భవనానికి శంకుస్థాపన..!

spot_img

కోకాపేట గౌడ్ ఆత్మీయ భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పది వేల కోట్ల విలువైన భూమిని మన బడుగు బలహీన వర్గాల కోసం సీఎం గారు కేటాయించారు. రాజకీయ కక్ష్యతో గత ప్రభుత్వాలు కల్లును నిషేధించాయి. రాష్ట్రం వచ్చాక గౌడ కులస్తులకు ఎక్సైజ్ వేదింపులు తప్పాయి. వైన్ షాప్ లలో 15 శాతం రిజర్వేషన్ కల్పించారు సిఎం కేసీఆర్. ఈ రాష్ట్రంలో చేయని పనులను గౌడ కులస్తులు కోసం చేసింది ఈ ప్రభుత్వం. నీరా పాలసీని తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. కల్లు తాగితే కరోనా రాదని అప్పుడు చెప్పాను. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది ఈ ప్రభుత్వం.

ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని పెట్టుకోబోతున్నాము. గీత కార్మికులు తాటి చెట్టు పైనుండి పడి చనిపోతే ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందిస్తున్నాము. మన కోసం ఇంత చేసిన ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి. మనం ఐక్యంగా ఉంటే అన్ని వస్తాయి. పొట్టి తాటి చెట్లు కుడా త్వరలో వస్తున్నాయి. చెట్టుపై నుండి పడి పోకుండా సేఫ్టీ మోకును అందిస్తాము. త్వరలోనే మోపెడ్స్ ను అందిస్తాము. కల్లు కాంపౌండ్ ఒక కుటీర పరిశ్రమ. దానిపైన చాలా కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి. డాబాల లాగా తాటి బార్ లను ఏర్పాటు చేయాలి. కల్లును కల్తీ చేయాల్సిన అవసరం గౌడ్ కులస్తులకు లేదు. గీత కార్మికులకు1200 కొట్లు పెన్షన్ అందించాము’ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles