Friday, May 17, 2024

మద్యం దుకాణాల దరఖాస్తులపై.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ఆదేశం

spot_img

మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణలో సిండికేట్ లు ఏర్పడకుండా మద్యం దుకాణాల కేటాయింపునకై ధరఖాస్తులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తులు స్వీకరించేందుకు హైదరాబాద్ లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేసామని దాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో CM KCR గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అందరికీ అవకాశాలు కల్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణలో ఎవరైనా సిండికేట్గా ఏర్పడిన, ఎవరైనా దరఖాస్తులు సమర్పించకుండా అడ్డంకులు సృష్టించే వారిపై, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే వారిపై గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

 

Latest News

More Articles