Monday, May 13, 2024

గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి

spot_img

గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తర్వాత మాట్లాడిన మంత్రి..రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ. 5 ల‌క్ష‌ల బీమాను కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్ష మంది గీత కార్మికులకు ప్రతి నెల రూ. 2016 ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మ‌ద్యం షాపుల్లో కేటాయింపుల్లో గౌడ సామాజిక వ‌ర్గానికి 15 శాతం, ఎస్సీ, ఎస్టీల‌కు 15 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించామన్నారు.

గీత వృత్తిదారులకు రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమాను ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రప‌టాల‌కు ‘నీరాభిషేకం’ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles