Friday, May 10, 2024

ఓఆర్ఆర్ లీజుపై వివరణ ఇచ్చిన స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్

spot_img

హైదరాబాద్: ఓఆర్ఆర్ లీజుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఓఆర్ఆర్ TOT ప్రాజెక్ట్ ల విలువను నిర్ధారించడానికి కన్సెషన్ రుసుము, భవిష్యత్తులో లభించే ఆదాయ వనరుల ప్రస్తుత నికర విలువ ఆధారంగా లెక్కవేసి, కన్షేషన్ కాలపరిమితి తో మూలధన సాధారణ వ్యయ మినహాయింపు ద్వారా లెక్కిస్తారుని తెలిపారు.

ORR,  సర్వీస్ రోడ్స్ మాత్రమే ఐఆర్బీకి(లీజు తీసుకున్న సంస్థ) వెళ్తాయన్నారు. ప్రకటనలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వం వద్దనే ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే గ్రినరీ, ట్రామా సెంటర్స్, సైకిల్ ట్రాక్స్ హెచ్ఎండి ఏ పరిధిలోనే ఉంటాయి. బేస్ ప్రైస్ ను నేహనల్ హైవే బయటకు చెప్పలేదు, అదే విధానాన్ని మేము పాటించాము. బేస్ ప్రైస్ ను ఐఈసివి గా పిలుస్తున్నామని తెలిపారు.

బిడ్డర్ తాను కోట్ చేసిన మొత్తాన్ని గడువు లోగా చెల్లించాలి, లేకపోతే అది ప్రభుత్వం తోనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దీనిపైన సమీక్ష చేస్తామని, ORR రెవెన్యూ గ్రోత్ పెరిగితే వారి లీజ్ కాల పరిమితి తగ్గుతూ వస్తుందన్నారు. ఓఆర్ఆర్ ట్రాఫిక్ ను ఐదు సంవత్సరాలకు పరిగణలోకి తీసుకుంటామని, ప్రతి సంవత్సరం 5 నుండి 6 శాతం ట్రాఫిక్ పెరుగుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. తనపైన వ్యక్తిగత దూషణలు చేసేవారికి …నేనంటే చాలా అభిమానం ఉంది కావచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని స్పెషల్ సీ ఎస్ అరవింద్ కుమార్ సూచించారు.

Latest News

More Articles