Sunday, May 19, 2024

కుల,మతాలతో చిచ్చుపెట్టేవారి తగిన బుద్ధి చెప్పాలి

spot_img

కుల, మతాల పేరుతో చిచ్చుపెట్టేవారి తో జాగ్రత్తగా ఉండాలన్నారు మహబూబ్‌నగర్‌ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 55 ఏండ్లు అధికారంలో ఉండి కనీసం తాగు నీళ్లు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. కులం పేరిట కాంగ్రెస్‌ నేతలు, మతం పేరిట బీజేపీ నేతలు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి ఎకరాకు ఏడాదికి రూ.16వేలు రైతు బంధు అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ వస్తే దళితుల భూములను తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారని.. దళితుల భూమి సెంటు పోయినా తనదే బాధ్యత అని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీని అందించాలన్నారు మంత్రి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే కర్నాటక గతే

Latest News

More Articles