Monday, May 6, 2024

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ నోటీసులు జారీ

spot_img

సీనియర్‌ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మనీలాండరింగ్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. రూ.100 కోట్ల పోంజీ స్కీమ్‌ కేసుకు సంబంధించిన కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం నవంబర్ 20న తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ కు చెందిన భాగస్వామ్య సంస్థకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ప్రకాశ్‌రాజ్‌కి సమన్లు జారీ చేసింది.

ప్రణవ్‌ జ్యువెల్లర్‌ రూపొందించిన బోగస్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్ మెంట్‌ స్కీమ్‌పై విస్తృతంగా జరిపిన దర్యాప్తులో భాగంగా ప్రకాశ్‌రాజ్‌కు సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కంపెనీకి ప్రకాశ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల ఈడీ నిర్వహించిన దాడుల్లో 11.60 కిలోల బంగారు నగలతో పాటు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ పథకం, ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ప్రణవ్ జువెలర్స్, ఇతరులపై తిరుచ్చిలోని ఆర్థిక నేరాల విభాగం  దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: కర్ఫ్యూ లేని తెలంగాణ చూస్తున్నాం

Latest News

More Articles