Monday, May 6, 2024

కర్ఫ్యూ లేని తెలంగాణ చూస్తున్నాం

spot_img

గంగా జమున తెహజీబ్ లాగా అందరూ కలిసి ఉంటున్నామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా మైనార్టి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గోని మాట్లాడారు మంత్రి హరీశ్ రావు.. కర్ఫ్యూ లేని తెలంగాణ చూస్తున్నాం. ముస్లిం మైనార్టీ కోసం ఇప్పటి వరకు బడ్జెట్ 12 వేల కోట్లు ఖర్చు చేశాం. 204 రెసిడెన్షియల్ స్కూళ్ళ ద్వారా ఎంతో మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 3000 మంది అంబేద్కర్ ఓవర్ సీస్ స్కీమ్ ద్వారా 20 లక్షలు పొందారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వెళ్లి ఉన్నత చదువులు పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశీ విద్య కోసం 20 లక్షలు ఇచ్చే పథకం యావత్ దేశంలో ఎక్కడా లేదు. కర్ణాటకలో ఎంతో మంది ముస్లిం ప్రజలు ఉన్నారు. అక్కడ ఎందుకు కాంగ్రెస్ 4,000 పింఛన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

మెట్రో రైల్ ను సంగారెడ్డి వరకు తెస్తున్నామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. కరోనా సమయంలో మీకు అండగా ఉన్నది చింతా ప్రభాకర్. జగ్గారెడ్డి గెలిచి ముఖం చూపెట్టడం లేదు. గుజరాత్ ఎన్నికలు అయితే రాహుల్ గాంధీ పాద యాత్ర అటు వైపు వెళ్ళదు. బీజేపీకి రాష్ట్రంలో పోయిన సారి ఒక్క సీటు వస్తె, ఈసారి ఒక్కటి కూడా వచ్చేలా లేదన్నారు. చింతా ప్రభాకర్ ను ఆశీర్వాదించడానికి వచ్చిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు మంత్రి హరీశ్ రావు.

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. షాది ముబారక్ పథకం అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సదాశివ పేటలో ఖబరిస్తాన్ కోసం 5 ఎకరాలు ఇచ్చాం. 17000 మంది ఇమాంలకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నమన్న మంత్రి.. జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో ఉన్నారు… ఓడినా చింతా ప్రభాకర్ సంగారెడ్డి ప్రజల మధ్యలో ఉన్నారన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం ఆశ్చర్యపోతోంది

Latest News

More Articles