Sunday, May 19, 2024

ప‌టాన్‌చెరులో కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లను ప్రోత్స‌హిస్తున్నాం

spot_img

ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఇస్నాపూర్ వ‌ర‌కు మెట్రో వ‌స్త‌ద‌ని తెలిపారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో టోట‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు కూడా మెట్రో వ‌చ్చేస్తే ప‌టాన్‌చెరు ద‌శ‌నే మారిపోతుందన్నారు. ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. మ‌హిపాల్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ప‌టాన్‌చెరులో ప‌రిశ్ర‌మ‌ల కాలుష్యంతో..తాగే నీటితో చ‌ర్మ వ్యాధులు వ‌చ్చేవని తెలిపారు సీఎం కేసీఆర్. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ప్ర‌తి రోజు ప‌రిశ్రుభ్ర‌మైన నీళ్లు అందిస్తున్నాం. ఇప్పుడు ఆ జ‌బ్బుల బాధ త‌ప్పింది. రోగాల బాధ త‌ప్పింది. కార్మికుల అవ‌స‌రాల కోసం 350 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి శంకుస్థాప‌నం చేశాం. నిర్మాణం అవుతోందని తెలిపారు సీఎం కేసీఆర్.అంతేకాదు..పటాన్‌చెరులో కాలుష్యం త‌గ్గాలి. కాలుష్యం త‌గ్గేందుకు కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లను ప్రోత్స‌హిస్తున్నాం. సుల్తాన్‌పూర్‌లో మెడిక‌ల్ డివైజెస్ పార్కు వ‌చ్చింది. హార్ట్ పేషెంట్స్ కు అమ‌ర్చే స్టంట్లు కూడా ఇక్క‌డే త‌యారావుతున్నాయి. కంటి వెలుగు అద్దాలు గ‌తంలో చైనా నుంచి త‌ప్పించాం. ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే త‌యార‌వుతున్నాయి. మీరు ఆల్‌మోస్ట్ హైద‌రాబాద్‌లో క‌లిసిపోయారు. ప‌టాన్‌చెరు వేరే కాదు. ముగ్గురు కార్పొరేట‌ర్లు కూడా ఉన్నారు. జీహెచ్‌ఎంసీలోకి వ‌చ్చేశారు. కాబ‌ట్టి మీ ద‌గ్గ‌ర బ్ర‌హ్మాఒండ‌మైన కాలుష్యం లేని ఐటీ ప‌రిశ్ర‌మ‌లు పెద్ద ఎత్తున రాబోతున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: కుల వృత్తులను ఆదుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్

ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌టాన్‌చెరు మీద నుంచే పోతుంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వ‌ర‌కు డెఫినెట్‌గా మెట్రో వ‌స్త‌ది. దాంతో చాలా లాభం జ‌రుగుత‌ది. రాబోయే రోజుల్లో టోట‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డు వర‌కు మెట్రో వ‌చ్చేస్తే ప‌టాన్‌చెరు ద‌శ‌నే మారిపోత‌ద‌ని మ‌న‌వి చేస్తున్నానని తెలిపారు సీఎం కేసీఆర్. ఇక్క‌డ అమీన్‌పూర్‌లో 15, 20 కాల‌నీలు ఉండేవి. ఇవాళ 300 కాల‌నీలు వ‌చ్చాయి. ఎందుకంటే ఈ నియోజ‌క‌వ‌ర్గం కుత్బుల్లాపూర్ మాదిరిగా మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉంటారు. ఇదొక మినీ ఇండియా. ఉత్త‌ర భార‌తీయులు ఉంటారు. అన్ని చోట్ల నుంచి ఉంటారు. ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు అందులో ప‌ని చేసే కార్మికులు ఉంటారు అని అన్నారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే కర్నాటక గతే

Latest News

More Articles