Friday, May 17, 2024

కాంగ్రెస్ అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తుందా?

spot_img

కామారెడ్డి:- స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి జరగని అభివృద్ది, సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రమంతటా అద్భుతాలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. కామారెడ్డి పర్యటనలో ఉన్న తలసాని శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్, సాగు నీరు, తాగు నీరు మెరుగుపడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రమంతటా అద్భుతాలు జరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి. గ్రామీణ వ్యవస్థ, కులసంఘాలను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. తెలంగాణ పండుగలు విశ్వవ్యాప్తంగా జరుపుకునే విధంగా మారాయి.
కామారెడ్డి నియోజికవర్గం నుండి కేసీఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‎ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు చరిత్ర సృష్టించాలి. కేసీఆర్ స్వయాన పోటీ చేయడంతో కామారెడ్డి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందనుంది.

Read Also: నేడు పాక్, శ్రీలంక మ్యాచ్‌.. వర్షంతో రద్దయితే ఇండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదే

మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓ పార్టీ ప్రజల మధ్య గొడవలు పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది కదా.. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించింది వారే కదా. అప్పుడు సాధ్యం కానీ అభివృద్ధి వారికి ఇప్పుడు సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీ కర్నాటక మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. 45, 50 ఏళ్లు పాలించి ఏమీచేయని కాంగ్రెస్ మళ్ళీ ఒక అవకాశం ఇవ్వమంటుంది. అమలుకాని హామీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. మతాల పేరు చెప్పుకునే ప్రభుత్వం కేంద్రంలో ఉంది.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో రూ. 100 కోట్లతో కామారెడ్డి పట్టణంలో అభివృద్ది జరిగింది. రానున్న ఎన్నికల్లో గెలిచేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది. ప్రజల అవసరాలు, జీవన ప్రమాణాలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత చేస్తుందో మనం చూస్తున్నాం. భారత దేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం వల్ల వచ్చే 3, 4 ఏళ్లలో కామారెడ్డి రూపురేఖలు మారుతాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటు పడుతుంది. వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన, ఊహకందని మెజారిటీని ప్రజలు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వరి ధాన్యం గణనీయంగా పెరిగింది’ అని మంత్రి తలసాని అన్నారు.

Read Also: 49 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..!!

Latest News

More Articles