Thursday, May 2, 2024

49 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..!!

spot_img

Team India: ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో భాగంగా మంగళవారం శ్రీలంక తో జరిగిన టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ల ధాటికి 213 పరుగులకే భారత్ ఆలౌటైంది. అనంతరం మన బౌలర్లు కూడా చెలరేగడంతో శ్రీలంక 172 పరుగులకే కుప్పకూలింది.

ఇది కూడా చదవండి: 13,300 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి డేట్ ఫిక్స్

అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. మ్యాచ్‌లో భారత్‌ పదికి పది వికెట్లు స్పిన్నర్లకే సమర్పించుకుంది. 49 ఏళ్ల భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో బ్యాటర్లందరూ ఇలా స్పిన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: 10 మంది పిల్లలున్నవాడు భర్తగా కావాలి: మహిళ ప్రకటన

మరోవైపు వరుసగా 13 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న శ్రీలంకకు భారత్‌ చేతిలో పరాభావం ఎదురైంది. భారత్‌ తన చివరి మ్యాచ్‌ను శుక్రవారం బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. గురువారం జరిగే కీలక పోరులో పాక్‌, లంక తలపడతాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే మెరుగైన రన్‌రేట్‌ కలిగిన శ్రీలంక ఫైనల్‌ చేరి భారత్ తో తలపడనుంది.

మరిన్ని వార్తలు: 

ఇండియాలో పోర్న్ చూడొచ్చా? కేరళ హైకోర్టు సంచలన తీర్పు

టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

Latest News

More Articles