Sunday, April 28, 2024

కార్యకర్తలేపార్టీకి బలం.. బీఆర్ఎస్ కు తిరుగులేదు

spot_img

సూర్యాపేట : కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లోనీ సీతారామ, సుమంగళి ఫంక్షన్ హాల్లో  సూర్యాపేట రూరల్, చివ్వెంల మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ బూత్ ఇన్ ఛార్జ్ ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి.. రాబోయే ఎన్నికల దృష్ట్యా  వారి వారి బూత్ లలో  ఇన్ ఛార్జ్ లు చేపట్టవలసిన కార్యాచరణ పై దిశానిర్దేశంచేశారు.

Also Read.. 49 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..!!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంగా ప్రపంచం లో ఎవరూ చేయని విధంగా అద్భుతాలు బీఆర్ఎస్ పార్టీ  చేసింది అన్నారు. పార్టీలకతీతంగా చేసిన అభివృద్ధి , అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బలం అన్నారు.75 ఏళ్ల ప్రజాస్వామ్యం లో ఎన్నికల మేనిఫెస్టో ను  నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఎన్నికలమ్యానిఫెస్టోకు అతీతంగా  ఎన్నికల తో సంబంధం లేకుండా సంక్షేమమే ఎజెండా గా పరిపాలన అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకుపంచిన 75వేల కోట్ల రూపాయలే  దీనికి నిదర్శనం అన్నారు. గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మీ పథకాలను కూడా ఎన్నికల తో సంబందం లేకుండా  అవినీతి కి తావు లేని విధంగా పథకాలను ప్రవేశపెట్టి విజయ వంతంగా అమలు చేస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు.

Also Read.. కాంగ్రెస్ లో ఐరన్ లెగ్ అన్నాచెల్లెళ్లు..!!

ప్రజల మనోభావాలే పార్టీకి శిరోదార్యం అన్న మంత్రి.. ప్రభుత్వంగా చేసిన ప్రతీపని బీఆర్ఎస్ పార్టీ దే అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ద్రోహులు అంతా ఏకం అవుతున్నారన్న మంత్రి, బీఆర్ఎస్  ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృద్ధి పనులను ఇంటికి ఇంటికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు.. ఆ బాధ్యత ను బూత్ ఇన్ఛార్జ్ ల దే అన్నారు. ఆత్మవిశ్వాసమే  ఆయుధం గా ప్రతీ పథకాన్ని పార్టీ గా చేసుకుని ప్రభుత్వ పధకాలను , ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లి  వివరించాలని కోరారు. పార్టీగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చినం అన్నారు.సూర్యాపేట ప్రజలు చైతన్య వంతులు అన్న మంత్రి,అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ నే ఆశీర్వదిస్తారని ఆకాంక్షించారు.

Latest News

More Articles