Friday, May 17, 2024

హైదరాబాద్ లో కొత్తగా 14 బస్తీ దవాఖానాలు ఏర్పాటు

spot_img

పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాల ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ అంబర్ పేట డివిజన్ గోల్నాక లో బస్తీ దవాఖానను MLA కాలేరు వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు మంత్రి తలసాని. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. పేదల పై ఆర్థిక భారం పడకుండా కాపాడాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకే బస్తీ దవాఖానలని అన్నారు. GHMC లో 350 బస్తీ దవాఖానల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు కొత్తగా 14 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Latest News

More Articles