Saturday, May 4, 2024

ఎన్నికలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సంబంధం లేదు

spot_img

భారతదేశంలో డబుల్ బెడ్ రూం కాన్సెప్ట్ ఎక్కడా లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో మాట్లాడిన మంత్రి తలసాని…12వేల కు ప్రణాళికలు చేస్తే 11, 700 ఇండ్లు డ్రా ద్వారా ఎంపిక జరిగింది. కొన్ని చోట్ల 30 నుంచి 50 కోట్ల విలువైన భూమిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగింది. మరో 15 రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ సెకండ్ ఫెజ్ ప్రారంభం అవుతుంది. 6 ఫెజ్లలో ఇండ్ల పంపిణీ జరుగుతుంది. ప్రజలు తొందరపడి ఎక్కడపడితే అక్కడ తిరగకండి అని సూచించారు.

ఇది కూడా చదవండి:  ఇండియాపై కొనసాగుతున్న ఎలినినో ప్రభావం..!

కళ్లున్న కబోదులు ఇండ్లు కట్టేది లేదు కానీ…కట్టినవి చూడలేకపోతున్నారని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రేపటి(శనివారం) నుంచి పంపిణీ చేసే ఇండ్లను అందరూ చూడాలన్నారు. 7లక్షల ఆబ్లికేషన్స్ వచ్చాయి..ఒక్కో కుటుంబం నుంచి 8 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు 95వేలు వచ్చాయి. అప్లై చేసుకున్న వారిలో అన్ని పార్టీల వారు ఉన్నారని తెలిపారు మంత్రి తలసాని. డ్రా తీసిన తర్వాత వెంటనే లాక్ చేశారు…దాన్ని ఎవ్వరూ మార్చడానికి లేదన్నారు. పంపిణీ జరిగిన తర్వాత పేదలా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా? అనేది అందరికీ కనిపిస్తుందన్నారు. ఎన్నికలకు… డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సంబంధం లేదని తెలిపారు మంత్రి. అంతేకాదు ..ఎలక్షన్ కోడ్ కు డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీకి సంబంధం లేదని…ప్రభుత్వ నిబంధల ప్రకారం రిజర్వేషన్లు పంపిణీలో పాటించామని చెప్పారు.

Latest News

More Articles