Sunday, May 12, 2024

రైతుల రుణమాఫీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు

spot_img

నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమానికి, రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు.

హైదరాబాద్ లో వృధాగా ఉన్న భూములనే అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి భూములు అమ్ముతుంటే దానిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణమని అన్నారు. రైతుల రుణమాఫీ కావాలని కాంగ్రెస్ పార్టీకి లేదని,  ఎలాగైనా రుణమాఫీని అపాలని రాజకీయ లబ్ది పొందాలని కోర్టులో కేసు వేశారని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ ను కూడా సక్రమంగా ఇయ్యలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రూ.4000 ఇస్తారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు.

Latest News

More Articles