Saturday, May 18, 2024

గోల్కొండ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

spot_img

గోల్కొండలో నేటి నుంచి మొదలవుతున్న జగదాంబిక అమ్మవారి బోనాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందాయి. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, కమిషన్ సీవీ ఆనంద్ అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘మహంకాళి జగదాంబికా అమ్మవారి జాతర బోనాల ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభం అవుతున్నాయి. తెలంగాణ నడి బొడ్డున అంగరంగ వైభవంగా జగదాంబికా అమ్మవారి బోనాలు నిర్వహిస్తున్నాం. సికింద్రాబాద్, హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో బోనాలు జరిగాయి. తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకుంటున్నాం. బోనాలు, తోట్టేలు ఈ రోజు.. ఘటాల ఊరేగింపు, ఫలహారం బండి, గట్టం రేపు నిర్వహిస్తాం. భారత దేశంలో హిదూవుల గురించి మాట్లాడుతారు కానీ, హిందువుల పండుగలకు సహకరించరు. కానీ కేసీఆర్ మాత్రం హిందూ పండుగలను గొప్పగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పోలీస్ డిపార్ట్మెంట్‎కి అందరూ సహకరించాలి. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో బోనాల జాతరను నిర్వహించాలి.

రాష్టం ఏర్పడక ముందు అతి తక్కువ మందితో గోల్కొండ జగదాంబిక అమ్మవారి జాతర జరిగేది, కానీ ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారు. భారత దేశం చెప్పుకునే విధంగా రూ. 1200 కోట్లతో యాదాద్రిని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆషాడ మాసం మొత్తం బోనాల జాతర కొనసాగుతుంది. బోనాలు పండుగ అంటేనే తిని, తాగుడు పండుగ. హైదరాబాద్ బోనాలకు వివిధ జిల్లాల నుండి వస్తారు. ఎక్కడ చేయని విధంగా అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నాం. బోనాల పండుగకు 15 కోట్ల రూపాయల పండుగ ముందే అందజేశాం.’ అని మంత్రి తలసాని తెలిపారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భాగ్యనగరంలో బోనాల పండుగ మొదలైంది. ఈ రోజు జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు. నెల రోజుల పాటు ఈ పండుగ ఘనంగా జరుపుకుంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మండంగా నిర్వహించుకుంటున్నాం. రూ. 15 కోట్లు బోనాల పండగకు సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. 3036 దేవాలయాలకు 11 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. అందరూ సహకరించి పండగను నిర్వహించుకోవాలి. దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్‎లో వర్షంతో దేవుడు బోనాలకు స్వాగతం తెలిపారు. ఈ రోజు దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి వెలిగించడం జరుగుతుంది.

Latest News

More Articles