Friday, May 17, 2024

బీఆర్ఎస్ జోరుకు ప్రతిపక్షాలు బేజారు..

spot_img

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన వారికి పార్టీ అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్నారు. యువ‌కులు ఉరిమే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని ఆకాంక్షించారు. పార్టీకోసం ప్రతి యువ కార్తకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. పార్టీలో చేరినవారిలో చిలుకల నాగరాజు, ఎల్లబోయిన రాజు, మంతుర్తి సాయి, చిలుకల చేరాలు, వడ్డేపల్లి విష్ణు, మారబోయిన నాగరాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో సమయాల్లో మార్పులు

పంట నష్టపరిహారం రైతులకు అందించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‎కే దక్కుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు వరంగల్ జిల్లా, పరకాల నియోజకవర్గం, గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 544 మంది రైతులకు రూ.80.38 లక్షల విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘రైతుకు పంటకు పెట్టుబడి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. రైతు రాజ్యం తేవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో ప్రజలు గమనించాలి, ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. రైతులు అకాల వర్షాలకు పంట నష్టపోతే నష్ట పరిహారం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, రైతులను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‎ది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. మన రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేవు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు.. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేసి మాట్లాడాలి. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. గత ప్రభుత్వాలు ఏనాడూ ప్రజల కష్టాలు, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ రాష్ట్రంలో గల్లంతవడం ఖాయం. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ గెలుపు సాధించడం ఖాయం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి 40మంది లీడర్లు..!

Latest News

More Articles