Wednesday, May 22, 2024

సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

spot_img

పేదల మేలు కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. మహాలక్ష్మి పథకం  కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ.10లక్షల పెంపు పథకాన్ని ఇవాళ(ఆదివారం) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎన్‌బీటీనగర్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రారంభించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మిగిలిన అన్ని హామీలను కొత్త ప్రభుత్వం త్వరితగతిన నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, హిమాయత్‌నగర్‌ కార్పొరేటర్‌ మహాలక్ష్మి రామన్‌గౌడ్‌, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆర్టీసీ బస్సులో కొంతదూరం ప్రయాణించి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: పాలకుర్తిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు..అందరికీ అండగా ఉంటా

Latest News

More Articles