Saturday, May 18, 2024

సిద్దిపేట రైతు బిడ్డకు ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక శుభాకాంక్షలు

spot_img

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘బిగ్ బాస్ విజేతగా నిలిచిన మా సిద్దిపేట రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు శుభాకాంక్షలు’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బాస్ షోలో తన ప్రదర్శనతో పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని ప్రశంసించారు. సీజన్ ఆసాంతం సామాన్యుడి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచాడన్నారు. పంటపొలాల నుంచి బిగ్ బాస్ షో వరకు సాగిన అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుందని ట్వీట్ చేశారు హరీశ్ రావు.

Latest News

More Articles