Friday, May 17, 2024

సిద్ధిపేట విద్యార్థులకు శుభవార్త.. ప్రతి 10 మంది పిల్లలకు ఒక కేర్ టీచర్..!

spot_img

సిద్దిపేట నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షలఫై సమీక్ష సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు(కేర్ టీచర్) ఉండాలి. ఈ కేర్ టీచర్స్ తో నేను 15 రోజులకు ఒక సారి మాట్లాడుతా. చదువు లో వీక్ ఉన్న విద్యార్థుల ఫై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆ టీచర్ కు అప్పగించిన విద్యార్థుల పాస్ చేపించే, 10/10సాధించే బాధ్యత వాళ్లదే. ఇంటి వద్ద తల్లితండ్రులకు ఆత్మ విశ్వాసం నింపాలి. ఇంటి వద్ద పిల్లలు ఫోన్ లు వాడకుండా.. టివి లు చూడకుండా పిల్లలకు చెప్పాలి. తల్లి తండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి మీ పిల్లల చదువు కు ఈ పదవ తరగతి తొలి మెట్టు అని.. టివిలు… ఫోన్ లు ఆటలు ఈ రెండు నెలలు బంజేసేల చెప్పాలి. నేను వచ్చినపుడు పాఠశాలను విజిట్ చేస్తా. నేను తల్లితండ్రులకు ఉత్తరంలో వ్రాసిన ఉదయం 4గం లకే నిద్ర లేపి చదివించాలి. గత సంవత్సరం డిజిటల్ కంటెంట్ ఎలా చేసామో అదేవిదంగా ఈ సంవత్సరం కూడా డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిస్తాము.

ఇలా అన్ని ప్రణాళిక తో గత స్ఫూర్తి తో ముందుకెళ్దాం. గత సంవత్సరం 10/10 సాదించిన విద్యార్థులకు ట్యాబ్ ఇచ్చాము. అదేవిదంగా 100% ఫలితాలు సాదించిన పాఠశాలకు పారిశోతికం ఇచ్చాము ఈ సారి కూడా అదేవిదంగా ఇస్తాం. గత మూడు సంవత్సరాలనుండి సహకారం అందిస్తున్న. ఈ సంవత్సరం కూడా నా వంతు గా నేను సహకారం అందిస్తా. పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయుల తో ఇంటారాక్ట్ అయ్యారు… వీక్ ఉన్న విద్యార్థుల తో వారి తల్లితండ్రులతో నేరుగా నేను మాట్లాడుతా. మోటివెటర్స్ ను ఏర్పాటు చేపిస్తా… ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తా. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి… ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుక రండి. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ చూపాలి. సమిష్టిగా ముందుకెళ్దాం… అందుకు మీరు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఎదో ఒక సమయం లో పాఠశాల లను సందర్శించాలి. ఈ సమీక్ష లో జిల్లా విద్యా అధికారి శ్రీనివాస్ రెడ్డి, నోడల్ అధికారి రామ స్వామి, మండల విద్యా అధికారులు యాదవ రెడ్డి, దేశి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు…

Latest News

More Articles