Sunday, May 12, 2024

భద్రాద్రి ఊపిరి పీల్చుకో.. భవిష్యత్ మనదే..!

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ విజయోత్సవ సభ జరిగిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. భద్రాచలంలో బీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది. భవిష్యత్తు మనదే ఉంటది. మేమున్నం ఎవరు అధైర్యపడకండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కాపాడుకుందాం. బీఆర్ఎస్ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. గెలుపోటమలున్నాయి ఉన్నాయి. కెసిఆర్ పట్టుబట్టి ముందుండి కొట్లాడపోతే తెలంగాణ వచ్చేదా. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. అనేక ఒడి దుడుకులు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ప్రచారంలో అన్ని అబద్ధాలు పరిపాలనలో దాటవేట.

ప్రగతి భవన్ లో బంగారం బాత్రూంలు, 150 గదులు ఉన్నాయన్నారు. మొన్న అసెంబ్లీలో నిలదీస్తే తలకాయ కిందికి వేశారు. తప్ప ఎవరు సమాధానం చెప్పలే.‌ బిజెపి , కాంగ్రెస్ ఒకటే. అధానిని పదేళ్లు తెలంగాణలో అడుగుపెట్టనీయనిది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి రాంగనే అదానిని తెలంగాణకు తీసుకొచ్చారు. ఒక ఎరుకల సామాజిక వర్గం వ్యక్తిని, విశ్లేషకులు శ్రవణ్ ను ఎమ్మెల్సీ గా ఫైల్ పంపితే రాజకీయ నాయకులు అని గవర్నర్ రిజెక్ట్ చేసింది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఫైల్ పంపితే గవర్నర్ తక్షణమే ఆమోదించింది. బండి సంజయ్ , అరవింద్, ఈటెల, రఘునందనరావును ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. బిజెపి నిలవరించేది, పోటీపడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆదాని విషయంలో,ఎమ్మెల్సీల విషయంలో బిజెపితో దోస్తానా చేసింది మీరే అని మంది పడ్డారు హరీష్ రావు.

Latest News

More Articles