Wednesday, May 8, 2024

సీఎం, మంత్రులు కారుకూతలు బంద్ చేయాలి

spot_img

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా పెదవి విప్పడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం బడ్జెట్ పై కాంగ్రెస్ కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు కలిసి అన్యాయం చేస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల్లో చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కాంగ్రెస్, బీజేపీలు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటూ బీఆర్ఎస్ పై అవిశ్వాసాలు పెడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయలేదన్నారు. అవాకులు చవాకులు పేలడం కాదు..రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీయాలి. సీఎం, మంత్రులు కారుకూతలు బంద్ చేయాలి. కృష్ణా బోర్డుపై కాంగ్రెస్ కేంద్రం దగ్గర జీ హుజూర్ అన్నది. కేంద్రంతో కొట్లాడాలి తెలంగాణ ప్రయోజనాలు సాధించాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేశారు.

వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె .వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు తగ్గాయన్నారు. రైల్వేల్లో తెలంగాణకు ఏపీ కంటే కేటాయింపులు బాగా తగ్గాయి. కేంద్ర ఉద్యోగాలు 14 లక్షలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ ఊసే లేదు. బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు.

 

Latest News

More Articles