Saturday, May 18, 2024

ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపై ఉంది

spot_img

తెలంగాణ నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వ యజమాయిషీని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకుంటూ వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే కొత్తగా రాష్ట్రంల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందని చెప్పారు. తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్లగొండ’ బహిరంగ సభకు బయలుదేరే ముందు కడియం మీడియాతో మాట్లాడారు…నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్లగొం జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడుతోందికాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో అబద్ధాలను ప్రచారం చేసిందని విమర్శించారు. కృష్ణా నదికింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడం మంచిది కాదని, దాంతోతెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై తప్పులు రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కన్పించడం లేదన్నారు.రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియ చెప్పాల్సిన అవసరం తమపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు నది జలాల పైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపై సభలో ప్రజలకు వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో దీనిని మరింత ఉధృతం చేస్తామన్నారు కడియం.

Latest News

More Articles