Saturday, May 18, 2024

ఆరు నెలలకు సరిపడా సరుకులతో ఢిల్లీకి బయలుదేరిన పంజాబ్ రైతులు

spot_img

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతు సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం అలర్టైంది.ఢిల్లీకి రైతులు చేరుకోకుండా బార్డర్లలోనే ఆపేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. సరిహద్దులు మూసేయడంతో పాటు రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, కంటైనర్లతో గోడలు కట్టింది. రోడ్డుకు అడ్డంగా ఇనుప మేకులు బిగించింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. అయితే, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అడ్డంకులేవీ తమను ఆపలేవంటున్నారు రైతులు. ఆరు నెలల పాటు ఉండేందుకు సిద్దపడే వస్తున్నామని, అందుకు అవసరమైన సరుకులను వెంట తెచ్చుకుంటున్నామని పంజాబ్ కు చెందిన ఓ రైతు తెలిపాడు.

2020 లో రైతు సంఘాల పిలుపుతో ఢిల్లీ బార్డర్ కు చేరుకున్న రైతులు దాదాపు 13 నెలల పాటు అక్కడే వుండి ఆందోళనలు చేశారు. అప్పట్లో వారితో పలుమార్లు చర్చలు జరిపిన కేంద్రం.. రైతుల ప్రధాన డిమాండ్లకు అంగీకరించింది. అయితే, అప్పట్లో కేంద్రం ఇచ్చిన వాటిలో ఇంకా చాలా హామీలు అమలు కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఆందోళనకు సిద్ధమైనట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

ఇది కూడా చవండి:ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపై ఉంది

Latest News

More Articles