Friday, May 17, 2024

చిట్టచివరి సమావేశంలో.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

spot_img

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్నట్టు జాతీయ సర్వేలు చెప్తున్నాయి. అత్యధిక స్తనాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నట్టు రిపోర్టులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక శిబిరాలు ఉత్సాహంగా ముగిసాయి. BRS సోమవారం 16 రోజులపాటు జరిగిన సన్నాహక సమావేశాలను ముగించింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సమావేశాలు జరిగాయి.

నేడు తెలంగాణ భవన్‌లో నల్గొండ నియోజకవర్గంపై జరిగిన లోక్‌సభ ఎన్నికల చివరి సన్నాహక సమావేశంగా మిగిలింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రసంగిస్తూ.. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల అక్రమ పొత్తు బట్టబయలైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భుజాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ పై గురి పెట్టారని అన్నారు.

ఈ రెండు పార్టీల కుమ్మక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలి. రాహుల్ అదానీని దొంగ అంటే రేవంత్ దొర అంటున్నాడు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచు కోవాలి. కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దాo. అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles