Sunday, May 12, 2024

వస్త్ర పరిశ్రమపై కాంగ్రెస్‎కు కేటీఆర్ కీలక సూచన

spot_img

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభంపై ఆయన స్పందించారు. ‘గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్‎లూమ్ నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‎లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయి. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుంది’ అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

Read Also: వైరలవుతున్న సచిన్ డీప్ ఫేక్ వీడియో

Latest News

More Articles