Monday, May 13, 2024

దివ్యాంగులకు వెన్ను దన్నుగా సీఎం కేసీఆర్

spot_img

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డిలు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని, అభ్యర్థి కడియం శ్రీహరిని గెలిపించుకుంటామని దివ్యాంగుల సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మరో కీలక నేత

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణలో దివ్యాంగులకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు దాటలేదు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం అత్యాధునిక వినికిడి యంత్రాలు, ద్విచక్ర వాహనాలు ఇస్తున్నది. గ్రూప్స్ తదితర పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ దివ్యాంగులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. దివ్యాంగుల కోసం 100% సబ్సిడీతో ట్రై సైకిళ్లు బ్యాటరీ సైకిలను పంపిణీ చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు వెన్ను దన్నుగా నిలబడి ఉన్నారని పేర్కొన్నారు.

Latest News

More Articles