Friday, May 17, 2024

మహిళా బిల్లు విజయంలో కవిత పోరాటమే కీలకం!

spot_img

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటం ఫలితాలను ఇస్తోంది. మహిళా రిజర్వేషన్ల గురించి దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం, ఇటీవల 47 రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం వంటి వాటి వల్ల ఇప్పటికే అనేక ముఖ్యమైన రాజకీయ పార్టీల మద్దతును కవిత కూడాగట్టారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం కూడా కవిత పోరాటానికి మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఈ రోజు కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహిస్తున్న సమావేశాలలో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం నిన్న సాయంత్రం అత్యవసరంగా కేంద్ర కేబినెట్ ను సమావేశపరచి.. బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు ముసాయిదాకు ఆమోదం తెలిపారు. ఇవాళ (సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.

ఆమోదం లాంఛనప్రాయమే..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటంతో ఇటు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, అటు ప్రతిపక్షంలోని మెజారిటీ పార్టీలు మద్దతు తెలపడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లాంఛన ప్రాయమేనని చెప్పొచ్చు. లోక్ సభలో ఇవాళ బిల్లును ప్రవేశపెట్టగా.. దీనిపై రేపు సభలో చర్చించనున్నారు. ఇక రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టి.. ఆదే రోజు చర్చించి ఆమోదిస్తారు. ఈ బిల్లు పాసైతే పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు దక్కనున్నాయి.

డీలిమిటేషన్ తర్వాతే అమలు..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటంతో చట్టంగా రూపుదిద్దుకోబోతున్న చట్టసభల్లో మహిళా రిజరేషన్ల బిల్లు అమలులోకి వచ్చేందుకు మరో మూడు, నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాతే ఈ చట్టం అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. అయితే డీలిమిటేషన్ కంటే ముందుగా.. పెండింగ్ లో ఉన్న 2021 జన గణన పూర్తవ్వాల్సి ఉంది. దేశమంతటా జనాభా లెక్కలు పూర్తయ్యాక 2026 నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతి నుంచి జరిగే ఎన్నికల్లో మాత్రమే మహిళా రిజర్వేషన్ అమలులోకి రానుంది.

ఎమ్మెల్సీ కవిత పోరాటంతో.. అన్ని పక్షాల అంగీకారం

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటమే కీలకమని రాజకీయ విశ్లేషకులతో పాటు మహిళా సంఘాలు ప్రశంసిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారుకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తాత్సారం చేస్తుండడంతో కవిత జంగ్ సైరన్ మోగించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం సాగించారామె. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో దీక్షకు కూర్చుని ఇటు కేంద్ర ప్రభుత్వం పైనా అటు ప్రతిపక్షాలపైనా ఒత్తిడి పెంచారు. ఆ సమయంలో ఆమెకు దాదాపు 20 పార్టీలు మద్దతు ప్రకటించాయి. మహిళా బిల్లు విషయంలో మరోమారు కవిత పోరాటానికి సిద్ధమవుతున్నారని ఇటీవల వార్తలు వచ్చి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా కవితకు మద్దతు తెలిపారు. ఈ కవిత పోరు విజయవంతమై.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అత్యవసరంగా మోదీ సర్కారు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది.

Read Also: హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు.. డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు

‘రజాకార్’ ట్రైలర్ మీద కేటీఆర్ సీరియస్.. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు!

Latest News

More Articles