Friday, May 17, 2024

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు.. డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు

spot_img

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు జరిపింది. అయితే ఈ సోదాలు జరిగే సమయంలో నవదీప్ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి నవదీప్.. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ రోజు వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read Also: మహిళా బిల్లుపై కేంద్ర నిర్ణయం వెనుక కేసీఆర్‎ది పెద్ద పాత్ర

దాంతో తాజాగా మరోసారి నవదీప్ మరోసారి హైకోర్ట్‎లో పిటిషన్ వేశారు. అయితే నవదీప్ పై నార్కోటిక్ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేస్‎లో హీరో నవదీప్ 37 నిందితుడిగా ఉన్నాడు. నవదీప్ తన మిత్రుడు రామ్‎చంద్ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల గుర్తించారు. ఇప్పటికే రామచంద్‎ని అరెస్ట్ చేయడం గమనార్హం.

Latest News

More Articles