Sunday, May 19, 2024

బీఆర్ఎస్ మ్యానిఫెస్టో‌ చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యింది: ఎమ్మెల్సీ కవిత

spot_img

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల వేళ తెలంగాణకు మోదీ, రాహుల్ టూరిస్టుల వస్తుంటారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ హయంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే మూడు తరాలు పెట్టేదన్నారు.

రాహుల్ గాంధీ పేరు ఎన్నికల గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ బీసీ గణన గురించి కొత్త రాగం ఎత్తుకున్నారు..బీసీల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న ఏకైక రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న సంగతి తెలుసుకోవాలని చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీ కొత్తగా చెబుతున్నదేమీ లేదని..పాతచింతకాయ పచ్చడి వలె చెప్పిందే చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అంటేనే బీసీల ప్రభుత్వం అని కవిత అన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు హయంలో ప్రైవేటీకరణ అయ్యింది. అప్పుడు నోరుమెదపని కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడెందుకు ఎగిరెగిరి పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కార్మికులకు 18కోట్ల నిధులు, వేతనాలు తాము ఇచ్చుకున్న సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. మహారాష్ట్రకు చెరకు తరలిస్తే..రవాణ ఖర్చులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. రైతుల మీద రాజకీయం చేసే రాహుల్ గాంధీ..రాష్ట్రంలో ఎలాంటి మతకల్లోలా తావులేదన్నారు. గతంలో సీఎం మారాలంటే మతకల్లోలాలుఉండేవి…ఇప్పుడు తెలంగాణ మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

అందుకే తెలంగాణకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయని కవిత అన్నారు. తాగు నీరు ,సాగు నీరు ,మహిళా భద్రత ,మౌలిక సదపాయాల కల్పన లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.రాహుల్ గాందీ నిజామాబాద్ వస్తున్నారంటే స్వాగతం పలుకుతాం..ఇక్కడి అంకాపూర్ చికెన్ రుచి చూపిస్తాం… కానీ ఇక్కడి వాతవరణాన్ని మాత్రం చెడగొట్టకండి అని కవిత అన్నారు. తెలంగాణ వాటాల పై రాహుల్ గానీ ,సోనియా గాంధీ కానీ ఒక్క సారి కూడా మాట్లాడలేదు. అలాంటి ది ఈరోజు తెలంగాణ కు ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

Latest News

More Articles