Wednesday, May 22, 2024

మహిళా సురక్షా సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత సందడి

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో  భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన మహిళా సురక్షా సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

వీరితోపాటు రాష్ట్ర డీజీపీ అంజనికుమార్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి,మహిళ శిశు సంక్షేమ శాఖ మహిళా కెమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్ ఇంఛార్జి షికాగోయల్, సినీ హీరో నాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల సంబరాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు కోలాహలంగా మారాయి. నగర వాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను ఎమ్మెల్సీ కవిత తిలకించారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని 18 రాష్ట్రాలు షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం, రౌడీ రాజ్యం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని కొందరు అవహేళనగా మాట్లాడిన మాటలు పటాపంచలయ్యాయని ఆమె స్పష్టం చేశారు.

గత తొమ్మిదేళ్లలో పోలీసులు అద్భుతమైన భద్రత అందిస్తున్న కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో పోలీసులు వస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో 14 నిమిషాలలో పోలీసులు బాధితుల వద్దకు చేరుతున్నారని కవిత వివరించారు. ఇన్ని విజయాలు సాధిస్తున్న పోలీసులకు ప్రజల తరఫున కవిత అభినందనలు తెలియజేశారు.

Latest News

More Articles