Friday, May 17, 2024

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం

spot_img

వరంగల్ : ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును బట్టి భద్రతను కేటాయిస్తారని ఎమ్మెల్సీ కవిత వివరించారు. కాన్వాయ్ ని భద్రతకు అనుగుణంగా ఎలా, ఎక్కడ తీర్చిదిద్దాలన్న విషయాలను పోలీసులు ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారని, అవసరమైనప్పుడు తీసుకొచ్చి కాన్వాయ్ ని వినియోగిస్తారని తెలిపారు.

భద్రత విషయంలో రాజకీయ నాయకుల పాత్ర ఉండదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో తనకు ఇంత భద్రత… అంత భద్రత ఉండాలని కేసీఆర్ కోరలేదని, పోలీసులే అవసరమైనంత భద్రత కల్పించారని ప్రస్తావించారు. అయితే, దాన్ని పెద్ద అంశంగా చేసి వాహనాలను విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెటకారంగా మాట్లాడడం వారి గౌరవాన్నే తగ్గిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం దురదృష్టకరమని తెలిపారు.

వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమెతోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు పాల్గొన్నారు.

Latest News

More Articles