Thursday, May 2, 2024

కాంగ్రెస్ అవిశ్వాస కుట్ర.. భగ్నం చేసిన పాడి కౌశిక్ రెడ్డి

spot_img

కరీంనగర్ జిల్లా : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్ పెట్టారు. రాజేశ్వర రావు వైపే జమ్మికుంట కౌన్సిలర్లు నిలిచారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ కు 23 మంది కౌన్సిలర్లు వినతి  పత్రాలు అందజేశారు. తక్కల్లపల్లి రాజేశ్వర రావు వైపే మొగ్గు అంటూ తీర్మానం చేశారు. నిన్న పొనగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణనలోకి తీసుకోవద్దని ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ను కోరారు. అలాగే పార్టీ తరపున విప్ ను జారీ చేస్తూ లేఖను కూడా కలెక్టర్ కి అందించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన పొనగంటి మల్లయ్య కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కొందరు జమ్మికుంట కౌన్సిలర్లమంటూ అవిశ్వాస తీర్మానం ఇచ్చారని, అదేం లేదని ఈరోజు మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ తో కలిసి కలెక్టర్ కు విన్నవించినట్లు తెలిపారు. తమ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ జమ్మికుంటలో ఉండబోతున్నారు. ప్రజాపాలన పేరు చెబుతూనే ఈ కాంగ్రెస్ మా కౌన్సిలర్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇవన్నీ జమ్మికుంట ప్రజలు గమనించాలని కోరుతున్నా. కళ్యాణ లక్ష్మీ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా లంచాలు తీసుకుని కొందరు అధికారులు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. జమ్మికుంట ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమ పంపిణీ వెనుక ఉన్నదెవరు..? కళ్యాణ లక్ష్మీని కళ్యాణమస్తుగా మార్చి తులం బంగారం ఇస్తామని చెప్పారు. అది మేం అడుగుతామనే భయంతోనే దొడ్డిదారిన చెక్కుల పంపిణీ చేశారు. రైతులకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వడం లేదు. వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ప్రతీ మూల వరకూ నీళ్లిచ్చారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోంది..? ఇప్పటివరకూ రైతుబంధు వేయలేదో ఈ కాంగ్రెస్ సర్కారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest News

More Articles