Friday, May 17, 2024

ట్రాఫిక్ చలాన్ల వెబ్ సైట్ డౌన్.. రెచ్చిపోతున్న కేటుగాళ్లు

spot_img

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు ప్రారంభమైన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్ సైట్ సర్వర్ తాత్కాలికంగా డౌన్ అయింది. దీనిని అవకాశంగా తీసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి వాహనదారుల నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఓ పోర్టల్ ను పోలీసులు గుర్తించారు. ఇలాంటి వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించడంతో వాటిని చెల్లించడానికి చాలా మంది వినియోగదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వెహికల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు రావడం లేదు. సాధారణంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పెండింగ్ చలాన్ల వివరాలను చూపించే వెబ్ సైట్ వినియోగదారులను పేమెంట్ గేట్ వేకు తీసుకెళ్తుంది. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు చెల్లింపులు చేయలేకపోతున్నారు.

Latest News

More Articles