Friday, May 17, 2024

వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి

spot_img

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దళారీ వ్యవస్థను అరికట్టి రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు ఎమ్మెల్సీ కవితం.

ఇది కూడా చదవండి:17న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

 

Latest News

More Articles