Thursday, May 2, 2024

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

spot_img

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన దగ్గర నుంచి బస్సుల్లో విపరీతమైన రద్ధీ ఉంటోంది. దీంతో టీఎస్ ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో సీట్ల మాదిరిగా బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లకు సీట్లను ఏర్పాటు చేయడంతో మధ్యలో ఎక్కువ మంది ప్రయాణికులు నిల్చోవచ్చిని భావిస్తోంది. దీని ద్వారా ఒక్కో బస్సులో సాధారణం కంటే మరో 25 మంది ప్రయాణికులు జర్నీ చేయవచ్చని తెలుస్తోంది.
మొదటగా పలు సిటీ బస్సుల్లో సీట్లను మార్చి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. ప్రయోగాత్మక చేపట్టిన ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్‌లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఆర్టీసీ.

ఇది కూడా చదవండి:వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి

Latest News

More Articles