Tuesday, May 21, 2024

యువకుడి పైచదువులకు ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్సీ కవిత

spot_img

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె.. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూతనందించారు. నగరానికి చెందిన సామల రితీష్‌కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది. కానీ, చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే రితీష్ తండ్రి తన కొడుకుని అమెరికాకు పంపించే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రితీష్ ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవితకి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. రితీష్ అమెరికాకు వెళ్లడానికి అవసరమయ్యే ఖర్చులను భరిస్తానన్నారు. తమ కొడుకు కలను సాకారం చేసుకునేందుకు ఆర్థికంగా ఆదుకున్న ఎమ్మెల్సీ కవితకు రితీష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles